Market Closing: ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు చివరికి నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ఐఐ అమ్మకాలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల వంటి కారణాలు అమ్మకాల ఒత్తిడికి కారణాలుగా నిలిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 360 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 101 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 216 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 215 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో క్యూ3 ఫలితాలను విడుదల చేస్తున్న కొన్ని కంపెనీలు అలజడిని సృష్టిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, సిప్లా, ఎయిర్ టెల్, దివీస్ ల్యాబ్, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, యూపీఎల్, ఐటీసీ, నెస్లే, విప్రో, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications