Stock Market: నష్టాలను అధిగమించి లాభాల్లోకి సూచీలు.. దెబ్బేసిన బ్యాంకింగ్ స్టాక్స్..
Market Closing: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాల మధ్య నష్టాల్లో దేశీయ మార్కెట్లు ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఇంట్రాడేలో మారిన ఇన్వెస్టర్ల ధోరణితో చివరికి సూచీలు లాభాల బాట పట్టాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 144 పాయింట్ల నష్టంలో నేడు ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 31 పాయింట్ల మేర స్వల్ప లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో పవర్ రియల్టీ రంగాల్లోని షేర్లు లాభపడగా.. మెటల్ స్టాక్స్ నష్టాలపాలయ్యాయి.

ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, ఎస్బీఐ, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతీ ఎయిర్ టెల్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications