Stock Market: లాభాల్లో Sensex.. కొత్త రికార్డులను తాకిన నిఫ్టీ.. అంతా ఐటీ స్టాక్స్ మాయ..
Market Closing: ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో మరింతగా పుంజుకున్నాయి. అయితే సెకండ్ సెషన్లో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు మెుగ్గుచూపారు. దీంతో లాభాలు కొంత మేర ఆవిరయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 165 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 30 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 26 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 294 పాయింట్లను కోల్పోయింది.

ఈరోజు ప్రధానంగా ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు మార్కెట్లను లాభాల్లో ముందుకు నడిపించాయి. అయితే పవర్ సెక్టార్ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడై మార్కెట్లను కిందకు లాగాయి. ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ 66 వేల మార్కును అందుకోగా.. నిఫ్టీ సూచీ 19550 పాయింట్ల మార్కును తాకింది. దీంతో మార్కెట్ల రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ సూచీలు కొత్త శిఖరాలను తాకేందుకు ర్యాలీని కొనసాగిస్తున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో టీసీఎస్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎల్టిఐఎమ్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, యూపీఎల్, మారుతీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, టాటా కన్జూమర్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టైల్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా క్లోజ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications