Stock Market: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచటంతో భారత మార్కెట్లలో కొంత స్థబ్ధత కనిపించింది. అయితే ఆ తర్వాత మార్కెట్లు పుంజుకోవటంతో సూచీలు సూపర్ లాభాలను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 556 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 166 పాయింట్లు ఎగబాకింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 372 పాయింట్ల లాభాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 188 పాయింట్ల లాభంతో ఈ రోజు ప్రస్థానాన్ని ముగించాయి.

అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర ఈరోజు ఒక్కో షేరుకు 4 శాతం పెరిగి రూ.1,912కి చేరుకుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గత కొన్ని నెలలుగా అస్థిరతను చూడగా ప్రస్తుతం షేర్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా ఐదవ సెషన్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు ఏకంగా రూ.1,338 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
మార్కెట్లు ముగిసే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, ఎయిర్ టెల్, గ్రాసిమ్, టీసీఎస్, బ్రిటానియా, టాటా స్టీల్, సన్ ఫార్మా, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ముగిశాయి.
ఇక ఎన్ఎస్ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, నెస్లే, పవర్ గ్రిడ్, ఐటీసీ, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, మారుతీ, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications