Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న ఆందోళనలు..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు రోజురోజుకూ కొత్త శిఖరాలకు చేరుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కీలక సూచీలు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 302 పాయింట్ల లాభంతో క్లోజ్ అయ్యింది. మరో కీలక సూచీ నిఫ్టీ 84 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 258 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 248 పాయింట్ల మేర లాభంలో ఈరోజు ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మెరుగైన పనితీరును కనబరచటం మార్కెట్ల ర్యాలీకి దోహదపడింది.

మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, ఎస్బీఐ, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్, రిలయన్స్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, హీరో మోటార్స్, టీసీఎస్, బజాజ్ ఆటో, మారుతీ, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఎల్ టిఐఎమ్, బ్రిటానియా, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications