Stock Market: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. అందుకోసమే ఇన్వెస్టర్లు వెయిటింగ్..
Market Closing: ఉదయం భారీ ఓలటాలిటీ కారణంగా లాభాలు ఆవిరైన సెన్సెక్స్-నిఫ్టీలు ముగింపు సమయానికి తిరిగి తేరుకున్నాయి. వాస్తవానికి లార్జ్ క్యాప్ కంపెనీల్లో ర్యాలీ మార్కెట్లను పుంజుకునేందుకు దోహదపడింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 105 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంల నిఫ్టీ బ్యాంక్ సూచీ 18 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 184 పాయింట్లు నష్టపోయాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారులు ఈవారం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై చేయనున్న ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి..

ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, మారుతీ, రిలయన్స్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, ఎల్ టి, ఎన్టీపీసీ, ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, టీసీఎస్, టైటాన్, అదానీ పోర్ట్స్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్,ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications