Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ.. ఓలటాలిటీ ఉన్నప్పటికీ..
Market Closing: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో కీలక సూచీ సెన్సెక్స్ కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఎన్నికలకు ముందరే ఇది 73,000 మార్కును అధిగమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
మార్కెట్లు ముగిసే సమయంలో ఓలటాలిటీ ఉన్నప్పటికీ కీలక సూచీలు లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 103 పాయింట్లు లాభపడగా.. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 52 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ అత్యధికంగా 329 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, నెస్లే, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎల్ టి, ఎస్బీఐ షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్, బ్రిటానియా, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications