Market Closing: మార్కెట్లలో కొనసాగిన బుల్ జోరు.. ఆ ఒక్క రంగం తప్ప..!
Market Closing: ఉదయం హుషారుగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ జోరును కొనసాగించాయి. మార్కెట్లో దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగాయి. కేవలం నిఫ్టీ ఫార్మా మాత్రమే ట్రేడవర్లను కొంత నిరాశకు గురిచేసింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 70 పాయింట్ల మేర లాభపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 67 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 307 పాయింట్లు లాభపడింది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు భారీగా లాభపడ్డాయి.

NSE సూచీలో ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హిందాల్కొ, మారుతీ, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, సిప్లా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎల్ టి, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలోని హీరో మోటార్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications