Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం..
Stock Market: ఉదయం నష్టాలతో ప్రయాణాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత పుంజుకుని లాభాల బాట పట్టాయి. ప్రధానంగా మార్కెట్లు ముగిసే సమయానికి ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల్లోని కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 234 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 111 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 84 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ప్రయాణాన్ని ముగించింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 206 పాయింట్ల లాభంతో తన ట్రేడింగ్ ముగించింది.

NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, సిప్లా, బజాజ్ ఆటో, హిందాల్కొ, ఎన్టీపీసీ, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే సమయంలో హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, సెస్లే, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications