Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. నష్టాల్లో బ్యాంక్ నిఫ్టీ..
Market Closing: ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా సేపు నష్టాల్లోనే కొనసాగాయి. అయితే కొద్దిసేపు నష్టాల్లో ఉన్న మార్కెట్లు చివరికి మార్కెట్లు ముగింపు సమయానికి లాభాల్లోకి చేరుకున్నాయి.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 535 పాయింట్ల మేర లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 163 పాయింట్ల లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 100 పాయింట్ల మేర నష్టపోయి తన ప్రయాణాన్ని నేడు ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 498 పాయింట్ల భారీ లాభాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కొనుగోళ్ల మద్దతు కారణంగా నిఫ్టీ సూచీ నేడు ఇంట్రాడేలో సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుంది.

NSEలో కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్ టి, మారుతీ, హిందాల్కొ, విప్రో, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హస్పిటల్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications