Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. మెరిసిన ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్..
Market Closing: అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి సూపర్ లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 491 పాయింట్లు లాభంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 141 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 491 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 781 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. దీనికి ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దోహదపడ్డాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, ఓఎన్టీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, నెస్లే, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్, టైటాన్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, హిందాల్కొ, గ్రాసిమ్, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications