Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ముంచిన బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త నెలలో తమ మెుదటి రోజును నష్టాల్లో ముగిచాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు ఇందుకు కారణంగా నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు బ్యాంకింగ్ మెటల్ రంగాల్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇదే క్రమంలో ఐటీ, రియల్టీ, ఫార్మా రంగాలు మాత్రం లాభపడ్డాయి. అమెరికా డెట్ సీలిండ్ డీల్ ముగియటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించటం దీనికి కారణంగా తెలుస్తోంది.

మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 194 పాయింట్ల నష్టపోగా.. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 47 పాయింట్లు నష్టాలను నమోదు చేసింది. ఈక్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 337 పాయింట్లు నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 51 పాయింట్ల లాభాలతో ప్రయాణాన్ని ముగించింది.
ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications