Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో ఫ్లాట్ ప్రారంభంతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాల్లో రోజును ముగించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీల క్యూ2 ఫలితాలు వెలువడనున్న క్రమంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 17 పాయింట్ల మేర కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 82 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 69 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు లాభపడ్డాయి. ఆందోళనల నేపథ్యంలో మార్కెట్లో పెద్దగా మెుమెంటం కనిపించలేదు.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, మారుతీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐఎమ్, యూపీఎల్, సిప్లా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications