Stock Market: ఇన్వెస్టర్లను ముంచిన ఐటీ షేర్లు.. నష్టపోయిన Sensex, Nifty..
Market Closing: ఉదయం లాభాలతో ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులతో చివరికి నష్టపోయాయి. వారాంతంలో సూచీల నష్టానికి ఐటీ రంగం షేర్లు కారణంగా నిలిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 192 పాయింట్ల లాభంతో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 23 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్స్ స్టాక్ భారీగా నష్టపోయింది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, దివీస్ ల్యాబోరేటరీస్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎల్ టి, ఎస్బీఐ, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో విప్రో, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, యూపీఎల్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, బీపీసీఎల్, గ్రాసిమ్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టిఐఎమ్, మారుతీ, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications