Market Closing: ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే ధోరణిలో ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల పనితీరుతో పాటు దేశీయంగా క్యూ2 ఫలితాలు ప్రతికూల సెంటిమెంట్లకు ఆజ్యం పోస్తున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 248 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 46 పాయింట్లను కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 35 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో మార్కెట్ సూచీలు ఉదయం భారీ నష్టాల నుంచి ముగింపు సమయానికి కోలుకున్నాయి.

ఈరోజు మార్కెట్లలో ఐటో రంగంలోని షేర్లు టాప్ పర్ఫార్మర్లుగా నిలిచాయి. ఇదే సమయంలో మెటల్ అండ్ పవర్ కంపెనీల షేర్లు కొంత నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో మార్కెట్ల ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయ్యింది. నష్టాల నుంచి వేగంగా మార్కెట్లు రికవరీ కావటంతో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పనితీరు మెరుగుపడింది. అలాగే డాలర్‌తో రూపాయి మారకపు విలువ గత ముగింపు 83.27తో పోల్చితే స్వల్పంగా పెరిగి 83.24 వద్ద నేడు ప్రయాణాన్ని ముగించింది.
ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, హీరో మోటార్స్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, గ్రాసిమ్, బీపీసీఎల్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో విప్రో, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, యూపీఎల్, హిందాల్కొ, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని నేడు మార్కెట్లలో ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications