Market Closing: ఉదయం ఊగిసలాటతో మెుదలైన బెంచ్ మార్క్ సూచీలు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. అయితే నేడు మార్కెట్లలో ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు మంచి పనితీరును కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ కేవలం 5 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 113 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేశాయి. అలాగే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం మేర లాభపడ్డాయి.

NSEలో సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, నెస్లే, ఐషర్ మోటార్స్, టైటాన్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఎయిర్ టెల్, టీసీఎస్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications