Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అదరగొట్టిన అదానీ స్టాక్స్..
Stock Market: ఉదయం స్వల్ప లాభాలతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు సమయం గడిచేకొద్ది లాభాల బాట పట్టాయి. అదానీ గ్రూప్ షేర్ల విజృంభణతో సూచీలు సూపర్ ర్యాలీని కొనసాగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 204 పాయింట్ల, మరో కీలక సూచీ నిఫ్టీ 95 పాయింట్ల లాభంలో నిలిచాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 112 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 228 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని ముగించాయి. మార్కెట్లో నేడు ప్రధానంగా పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు ర్యాలీని నమోదు చేశాయి.

అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు సుప్రీం కోర్టు ప్రకటన తర్వాత భారీ ర్యాలీని నమోదు చేశాయి. దీంతో ఒక్కరోజులోనే అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ దాదాపు 15 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇదే సమయంలో రాజీవ్ జైన్ GQG పార్ట్నర్స్ కొన్ని గంటల్లోనే రూ.3,000 కోట్ల లాభాన్ని పొందింది. AceEquity డేటా ప్రకారం అదానీ 10 లిస్టెడ్ కంపెనీల్లో ఆరింటిలో వాటాను కలిగి ఉందని వెల్లడైంది.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, హిందాల్కొ, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, యూపీఎల్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో సిప్లా, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా, ఐటీసీ, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications