Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదొడుకుల ప్రయాణం తర్వాత నష్టాల్లో తమ ప్రయాణాన్ని క్లోజ్ చేశాయి. అయితే ప్రధాని సెమికాన్ 2024లో చేసిన ప్రకటనలతో మార్కెట్లోని సెమీకండక్టర్ స్టాక్స్ ర్యాలీని నమోదు చేశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 398 పాయింట్లను కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 123 పాయింట్ల పతనాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 262 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 101 పాయింట్లను కోల్పోయాయి. ఈ క్రమంలో ఎన్టీపీసీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగాలు 0.6 శాతం నుంచి 2 శాతం వరకు క్షీణతను చూశాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీల్ ల్యాబ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, విప్రో, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, టాటా స్టీల్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా చివరికి క్లోజ్ అయ్యాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications