ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(14, సెప్టెంబర్) స్వల్ప లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా లాభపడ్డాయి. కొద్ది రోజులుగా మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. అయితే సూచీలు మంగళవారం కోలుకున్నాయి. రోజంతా లాభాల్లో పయనించాయి. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు అందాయి. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం కలిసి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు ఆద్యంతం లాభాల్లో పయనించాయి. ఏజీఎం సమావేశానికి ముందు జెడ్ఈఈఎల్ 40 శాతం మేర ఎగిసిపడింది.
సెన్సెక్స్ ఉదయం 58,482 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 58,482-58,214 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 69.33 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 58,247 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 24.70 పాయింట్లు లేదా 0.14 శాతం లాభపడి 17,381 దగ్గర ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.69 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 16 లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, HCL టెక్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టైటాన్, టీసీఎస్ షేర్లు రాణించాయి. నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, HDFC, HUL, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(FIIs) సెప్టెంబర్ 13న రూ.1,419 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. డొమెస్టిక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (DIIs) రూ.559 కోట్ల మేర కొనుగోలు చేశాయి. టాప్ ఫైవ్ స్టాక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు 4.07 శాతం, HCl టెక్ 2.54 శాతం, కొటక్ మహీంద్రా 1.67 శాతం, బజాజ్ ఆటో 1.62 శాతం, టెక్ మహీంద్రా 1.55 శాతం లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్‌లో HDFC 1.07శాతం, నెస్ట్లే 0.97 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 0.87 శాతం, HUL 0.78 శాతం, టాటా స్టీల్ 0.74 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications