Closing Bell: ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్ ఆరంభం తర్వాత నష్టాల్లోకి జారుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు తిరిగి పుంజుకుని లాభాల బాట పట్టాయి. దీంతో సూచీలు లాభాల్లో ముగిశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ 74 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 118 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 137 పాయింట్ల మేర లాభపడ్డాయి. ప్రధానంగా రేపటి నుంచి ఐటీ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్లోకి విడుదలవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ రంగం షేర్లలో లాభాల స్వీకరణకు మెుగ్గుచూపుతూ అమ్మకాలకు దిగారు.

అయితే క్యూ3 ఫలితాలు అశించిన విధంగా ఉంటాయా లేదా అనే అనుమానాల మధ్య కీలక సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ ఎటు ప్రయాణించాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో రానున్న ఫలితాలు మార్కెట్లకు దిక్సూచిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టిఐఎమ్, హిందాల్కొ, టైటాన్, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, నెస్లే, మారుతీ, ఐటీసీ, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications