Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. కిందకు లాగిన ఐటీ స్టాక్స్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సైతం ఒడిదొడుకులతో నష్టాల బాటలోనే ముగిశాయి. ప్రధాన సూచీలు ఫ్లాట్ ముగింపునకు ప్రభుత్వ బ్యాంకులు, ఐటీ కంపెనీల షేర్ల నష్టాలే కారణంగా నిలిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 78 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 10 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 142 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 67 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి. అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ సూచీ మంచి పనితీరును కనబరిచింది. ఈ క్రమంలో ఎఫ్ఎమ్సీజీ రంగంలోని షేర్లు లాభాల బాట పట్టాయి.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, నెస్లే, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, గ్రాసిమ్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, విప్రో, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications