Stock Market: రోజంతా ఊగిసలాట.. నిండా ముంచిన బ్యాంక్ స్టాక్స్..
Market Closing: ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి ఆవిరయ్యాయి. ఈ క్రమంలో నేడు బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను కిందకు లాగాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో ముగియగా.. నిఫ్టీ సూచీ 32 పాయింట్ల మేర లాభపడింది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్ డ్రాగ్ చేయటం కారణంగా నిఫ్టీ బ్యాంక్ సూచీ 208 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 76 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడేలో అనేక మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మెుగ్గు చూపటంతో అమ్మకాల ఒత్తిడి లాభాలను చిత్తు చేసింది.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, ఎల్ టి, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఎల్‌టిఐఎమ్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, రిలయన్స్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications