Stock Market: ఊగిసలాడి లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. గెలిచిన ఆ రెండు రంగాల షేర్లు..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ ఊగిసలాటను కొనసాగించి చివరికి స్వల్ప లాభాలతో ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ఈ క్రమంలో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 129 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మత్రం 108 పాయింట్ల మేర లాభపడి ఇన్వెస్టర్లకు నిన్నటి భారీ నష్టాల నుంచి స్వల్ప ఊరటను కలిగించింది. ఈ క్రమంలో మెటల్, ఎఫ్ఎమ్సీజీ కంపెనీల షేర్లు లాభపడగా.. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు మాత్రం పెట్టుబడిదారులను నేడు నిరాశకు గురిచేశాయి.

ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్,టాటా స్టీల్, బజాజ్ ఆటో, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టి, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నేడు లాభాల్లో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, టైటాన్, కోల్ ఇండియా, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, మారుతీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications