అదరగొట్టిన ఐటీ, మెటల్ కంపెనీలు, దుమ్మురేపిన ఓఎన్జీసీ: పడిలేచిన రిలయన్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్దేశించిన రెండు వ్యాక్సీన్లకు అత్యవసర అనుమతులు మంజూరు నేపథ్యంలో మార్కెట్లు ఎగిసిపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం కూడా కలసి వచ్చింది. దీంతో నేడు సెన్సెక్స్ 48వేల మార్క్ దాటగా, నిఫ్టీ 14,100 మార్కును క్రాస్ చేశాయి. ఉదయం నుండి మార్కెట్లు లాభాల్లోనే కదలాడాయి.

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు
నేడు (సోమవారం జనవరి 4) సెన్సెక్స్ 307.82 పాయింట్లు(0.64%) లాభపడి 48,176.80 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114.40 పాయింట్లు(0.82%) ఎగిసి 14,132.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 2061 షేర్లు లాభాల్లో, 973 షేర్లు నష్టాల్లో ముగియగా, 158 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు ఎగిసి 73.02 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఉదయం 18 పైసలు లాభఫడి 72.94 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 73.12 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 72.90-73.03 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 7.76 శాతం, హిండాల్కో 6.69 శాతం, ఐచర్ మోటార్స్ 4.44 శాతం, ONGC 4.02 శాతం, TCS 3.80 శాతం లాభాల్లో ముగిశాయి.
టీసీఎస్ నేడు రూ.3000 మార్కును క్రాస్ చేసింది.
టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ 1.90 శాతం, కొటక్ మహీంద్రా 1.43 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.21 శాతం, అదానీ పోర్ట్స్ 0.98 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.79 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, రిలయన్స్, టీసీఎస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
ఉదయం నుండి నష్టాల్లో ఉన్న రిలయన్స్ షేర్ చివరి గంటల్లో స్వల్పంగా 0.14 శాతం లాభపడి రూ.1990 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.82 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.02 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో 1.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.66 శాతం, నిఫ్టీ ఐటీ 2.67 శాతం, నిఫ్టీ మీడియా 1.00 శాతం, నిఫ్టీ మెటల్ 5.09 శాతం, నిఫ్టీ ఫార్మా 1.14 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.11 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.33 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.04 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.09 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications