Stock Market: సెన్సెక్స్-నిఫ్టీ బౌన్స్ బ్యాక్.. ఐటీసీ స్టాక్ ఢమాల్..
Market Opening: ఒడిదొడుకుల కారణంగా నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం కీలక సూచీలు ఫ్లాట్ ఆరంభాన్ని నమోదు చేసినప్పటికీ తర్వాత కుదుటపడ్డాయి.
ఉదయం 9.37 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 92 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 310 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 190 పాయింట్ల మేర నష్టంతో ముందుకు కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, ఎల్ టి, ఎల్ టిఐఎమ్, మారుతీ, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఐటీసీ, సిప్లా, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, బ్రిటానియా, గ్రాసిమ్, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబ్, ఓఎన్జీసి,టైటాన్, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని


Click it and Unblock the Notifications