Stock Market: నష్టాల నుంచి మార్కెట్ల రికవరీ.. చివరికి లాభాల్లో ముగిసిన Sensex, Nifty
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమంగా ఉండటంతో ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఇంట్రాడేలో రికవర్ అయి చివరికి లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 149 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మేర లాభపడింది. అలాగే ముగింపు నాటికి నిఫ్టీ బ్యాంక్ సూచీ స్వల్పంగా నష్టాలతో 84 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 125 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ కంపెనీలు పుంజుకోవటంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ, ఐటీసీ, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎల్ టి, బీపీసీఎల్, రిలయన్స్, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, సిప్లా, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, నెస్లే, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications