Market Closing: కొత్తవారం మార్కెట్లో కొత్త జోష్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ఉదయం లాభాల్లో మెుదలైన సూచీలు అదే జోరును ఇంట్రాడేలో కొనసాగించాయి. దీంతో ఇన్వెస్టర్ల భారీగా సంపద కూడబెట్టుకున్నారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 126 పాయింట్ల మేర లాభపడింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 480 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 177 పాయింట్ల మేర లాభాలతో మంగళవారం మార్కెట్లు ట్రేడింగ్ ముగించాయి.

ప్రధానంగా రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 18800 స్థాయిలకు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యింది. బక్రీద్ సందర్భంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు జూన్ 29న మూసివేయబడతాయని స్టాక్ ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి.
NSEలో హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, బ్రిటానియా, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, ఐషర్ మోటార్స్, మారుతీ, హీరో మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications