For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్, బజాజ్ ఫైనాన్స్ అదుర్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూన్ 11) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకు పైగా ఎగిసి 52,600 పాయింట్లకు పైకి చేరుకుంది. నిఫ్టీ 15,900 దిశగా పరుగులు పెడుతోంది. ఉదయం భారీ లాభాల్లో కనిపించినప్పటికీ ఆ తర్వాత కాస్త మందగించింది. దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రుతుపవనాల ఆగమనం వంటి సానుకూల పరిణామాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి.

ఆ ఒక్కదేశం ఎఫెక్ట్, భారీగా ఎగిసిన బిట్ కాయిన్: ఏ క్రిప్టో ఎంత ఉందంటేఆ ఒక్కదేశం ఎఫెక్ట్, భారీగా ఎగిసిన బిట్ కాయిన్: ఏ క్రిప్టో ఎంత ఉందంటే

భారీ లాభాల్లో సెన్సెక్స్

భారీ లాభాల్లో సెన్సెక్స్

సెన్సెక్స్ నేడు 52,477.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,633.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,472.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 205.95 (0.39%) పాయింట్లు ఎగిసి 52,506.42 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,796.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,835.55 గరిష్టాన్ని, 15,781.45 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు +53.45 (0.34%) పాయింట్లు ఎగిసి 15,791.20 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 3.74 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.93 శాతం, టీసీఎస్ 1.53 శాతం, HCL టెక్ 1.51 శాతం, ఇన్ఫోసిస్ 1.43 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 1.58 శాతం, ఎస్బీఐ 0.98 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 0.85 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.76 శాతం, HDFC లైఫ్ 0.79 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.37 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.19 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం, నిఫ్టీ ఐటీ 1.56 శాతం, నిఫ్టీ మెటల్ 0.69 శాతం, నిఫ్టీ ఫార్మా 0.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.25 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 0.68 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 0.58 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.41 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.35 శాతం నష్టపోయాయి.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్, బజాజ్ ఫైనాన్స్ అదుర్స్ | Sensex, Nifty at record high: Bajaj Finance, Coal India top gainers

Benchmark indices hits fresh record high tracking positive Asian markets after S&P500 ended at a record high. IT and metal indices added a percent each while FMCG is under pressure.
Story first published: Friday, June 11, 2021, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X