రికార్డ్‌స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు: మెటల్, ఫైనాన్షియల్స్ జంప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(జూలై 7) లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపు ఊగిసలాటలో కనిపించాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చి, చివరి అరగంటలో జంప్ చేశాయి. చివరకు సెన్సెక్స్ 193 పాయింట్ల లాభాల్లో, నిఫ్టీ 61 పాయింట్ల లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఓ దశలో సెన్సెక్స్ 52,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒకటి తర్వాత మెటల్, రియాల్టీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు గరిష్ఠాలను తాకాయి. నిఫ్టీ ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్ 193 పాయింట్లు లాభపడి 53,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు ఎగిసి 15,879 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.60 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,919.71 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,105.41 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,751.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,819.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,893.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,779.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హిండాల్కో, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి. సెన్సెక్స్ 53వేల పాయింట్ల క్లోజ్ కావడం ఇదే మొదటిసారి. నిఫ్టీ 15,900 పాయింట్లకు చేరువైంది.


Click it and Unblock the Notifications