ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఫిబ్రవరి 8) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 529.73 పాయింట్లు లేదా 1.04% లాభపడి 51,261.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 157.20 పాయింట్లు లేదా 1.05% ఎగిసి 15081.50 పాయింట్ల వద్ద కదలాడింది. 1123 షేర్లు లాభాల్లో, 271 షేర్లు నష్టాల్లో ఉండగా, 69 షేర్లలో ఎలాంటిమార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 72.87 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 72.92 వద్ద క్లోజ్ అయింది. గతవారం రూపాయి స్వల్పంగా లాభపడింది.

600 పాయింట్లకు పైగా జంప్
నేడు ఉదయం గం.10.15 సమయం వరకు సెన్సెక్స్ 51,146.67 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,409.36 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,146.67 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 700 పాయింట్ల వరకు ఎగిసింది. నిఫ్టీ 15,064.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,119.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,041.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో దాదాపు 200 పాయింట్ల వరకు లాభపడింది.
నిఫ్టీ మొదటిసారి 15000 పాయింట్ల పైన ప్రారంభమైంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 6.69 శాతం, గెయిల్ 3.63 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.04 శాతం, టైటాన్ కంపెనీ 3.03, టాటా మోటార్స్ 2.80 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 1.14 శాతం, బ్రిటానియా 1.21 శాతం, యూపీఎల్ 0.85 శాతం, ఎన్టీపీసీ 0.90 శాతం, బజాజ్ ఆటో 0.36 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, దివిస్ ల్యాబ్స్, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.30 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.37 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.13 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.05 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.06 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.68 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.75 శాతం, నిఫ్టీ మీడియా 0.90 శాతం, నిఫ్టీ మెటల్ 1.00 శాతం, నిఫ్టీ ఫార్మా 0.63 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.42 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.03 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications