Nifty Run: దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఈ క్రమంలో టెలికాం కంపెనీ వొడఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వొడఫోన్ ఐడియా స్టాక్ ఇంట్రాడేలో ఏకంగా 8 శాతం పెరుగుదలను చూసింది.
ఉదయం 9.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 84,862.89 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 25,911.70 పాయింట్లను చేరుకుని సరికొత్త 52 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 248 పాయింట్లు పెరగగా, నిఫ్టీ సూచీ 107 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 61 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 282 పాయింట్ల పెరుగుదలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆటో, బ్యాంకింగ్ కంపెనీల షేర్లు ర్యాలీలో పాల్గొంటున్నాయి.

ఈ క్రమంలో ఇంట్రాడేలో బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీల్ ల్యాబ్, ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, హిందాల్కొ, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఏడాది టాప్-పెర్ఫార్మింగ్ ఇండెక్స్‌లుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ నాస్‌డాక్, S&P 500 కంటే వెనుకబడి ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లలో కొనసాగుతున్న మెగా ర్యాలీ 2025 వరకు విస్తరించవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 2024లో నిఫ్టీ సూచీ 18.7 శాతం రాబడిని అందించగా, మరో కీలక సూచీ సెన్సెక్స్ 17 శాతం మేర లాభపడింది. ఇవి ప్రస్తుతం ప్రధాన గ్లోబల్ మార్కెట్లలో మూడు మరియు నాల్గవ స్థానాలను పొందాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications