స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూన్ 11) లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సరికొత్త గరిష్టాన్ని తాకాయి. రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. చివరకు సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్లు లాభపడింది. ఐటీ రంగ స్టాక్స్‌తో పాటు రిలయన్స్, HDFC జంట షేర్లు రాణించడంతో సూచీలు లైఫ్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అయితే బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్టం నుండి దిగి వచ్చాయి. అయినప్పటికీ లాభాల్లోనే ముగిశాయి.

లాభాల్లో ముగిసిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,477.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,641.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,388.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 174.29 (0.33%) పాయింట్లు ఎగిసి 52,474.76 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,796.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,835.55 గరిష్టాన్ని, 15,749.80 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 61.60 (0.39%) పాయింట్లు ఎగిసి 15,799.35 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 3.94 శాతం, కోల్ ఇండియా 3.93 శాతం, JSW స్టీల్ 3.60 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.04 శాతం, హిండాల్కో 2.01 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో లార్సన్ 1.07 శాతం, HDFC లైఫ్ 0.96 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 0.95 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.90 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.87 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.39 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.20 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.28 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.28 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.28 శాతం, నిఫ్టీ ఐటీ 1.51 శాతం, నిఫ్టీ మెటల్ 2.69 శాతం, నిఫ్టీ ఫార్మా 1.05 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.17 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం, నిఫ్టీ మీడియా 0.96 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 0.54 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.04 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.41 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications