సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు: అందుకే భారీ లాభాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(డిసెంబర్ 12) నాడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 163.27 పాయింట్లు( 0.36%) లాభపడి 46,123.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 54.20 పాయింట్లు(0.40%) ఎగిసి 13532.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 933 షేర్లు లాభాల్లో, 213 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 56 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ నేడు మళ్లీ 13,500 పాయింట్లు దాటగా, సెన్సెక్స్ 46,000 పాయింట్లను దాటింది. మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 270 పాయింట్లు ఎగిసి 46,230 పాయింట్ల వద్ద ఉంది. ఓ సమయంలో 46,300 పాయింట్లకు దగ్గరగా ట్రేడ్ అయింది..

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 9.44 శాతం, GAIL 5.87 శాతం, NTPC 4.58 శాతం, కోల్ ఇండియా 3.60 శాతం, యూపీఎల్ 2.98 శాతం పెరిగింది.
టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 1.24 శాతం, అదానీ పోర్ట్స్ 0.90 శాతం, బ్రిటానియా 0.52 శాతం, భారతీ ఎయిర్ టెల్ 0.46 శాతం, ఐచర్ మోటార్స్ 0.42 శాతం లాభపడ్డాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యూపీఎల్, రిలయన్స్, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ ఉన్నాయి.

రిలయన్స్, టీసీఎస్ జంప్
అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 1.29 శాతం ఎగిసి రూ.2,033 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాప్ పరంగా భారత రెండో అతిపెద్ద కంపెనీ 0.62 శాతం పెరిగి రూ.2,801.50 వద్ద ట్రేడ్ అయింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.62 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.57 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.19 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.55 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.31 శాతం, నిఫ్టీ 0.43 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.87 శాతం, నిఫ్టీ ఐటీ 0.27 శాతం, నిఫ్టీ మీడియా 1.58 శాతం, నిఫ్టీ మెటల్ 1.58 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.74 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.14 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.50 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.34 శాతం నష్టపోయింది.

అందుకే జంప్
కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రానుండటంతో కరోనా కంటే ముందు పరిస్థితులు రానున్నాయని వార్తలు రావడం సానుకూల సంకేతాలు చూపాయి. విదేశీ పెట్టుబడుల వెల్లువ దన్నుగా నిలుస్తోందని చెబుతున్నారు. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీపై నెలకొన్న ఆందోళన, కొత్త కరోనా కేసుల వెల్లువ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు ఆచితూచి కదులుదున్నాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.66 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్లో 73.66 వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications