Stock Market: గతవారం జోరును దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం సైతం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. ఈరోజు ఇంట్రాడేలో సరికొత్త జీవితకాల గరిష్ఠమైన 62,700 మార్కును తాకింది. అమెరికా మార్కెట్లతో సంబంధం లేకుండా దేశీయ సూచీలు వరుగా ఈ వారం రెండోరోజు సైతం దూకుడును కొనసాగిస్తున్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 11.33 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 278 పాయింట్లు, నిఫ్టీ సూచీ 83 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 171 పాయింట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 70 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రతికూలంగా కొనసాగుతున్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం సానుకూలంగా ఉంది. విదేశీ మదుపరులు సైతం ప్రస్తుత తరుణంలో భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు.

టాప్ గెయినర్స్..
హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, హిందాల్కొ, హీరోమోటొకార్ప్, బ్రిటానియా, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, సిప్లా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఎల్అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, రిలయన్స్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతూ ఎన్ఎస్ఈ సూచీలో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications