2 రోజుల్లో సెన్సెక్స్ 1,000 పాయింట్లు పతనం: రిలయన్స్ జంప్, ఐటీ స్టాక్స్ డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (జనవరి 18) భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని కుప్పకూలాయి. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. మెటల్ రంగం ఏకంగా 4 శాతం కంటే ఎక్కువగా నష్టపోయింది. పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫార్మా సూచీలు 2 శాతం చొప్పున, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. నిఫ్టీ 14,300 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 49,000 దిగువకు పడిపోయి, 48,600 కంటే కింద క్లోజ్ అయింది.

2 రోజుల్లో 1000 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ 470.40 పాయింట్లు లేదా 0.96% పతనమై 48,564.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 152.40 పాయింట్లు లేదా 1.06% క్షీణించి 14,281.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 900 షేర్లు లాభాల్లో, 2074 షేర్లు నష్టాల్లో ముగియగా, 144 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 49,034 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 49,061 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,122 గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. ప్రతి నిమిషం అంతకంతకూ పతనమైంది. 48,404 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేటి గరిష్టం నుండి 700 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ఆ తర్వాత 150 పాయింట్లు ఎగబాకి 48,,564 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ రెండు రోజుల్లో 1000 పాయింట్లకు పైగా పడిపోయింది.
డాలర్ మారకంతో రూపాయి 73.28 వద్ద క్లోజ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, HDFC బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలోUPL 7.42 శాతం, రిలయన్స్ 2.40 శాతం,టైటాన్ కంపెనీ 1.78 శాతం, HDFC బ్యాంకు 1.12 శాతం, ITC 0.87 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.55 శాతం, టాటా మోటార్స్ 5.51 శాతం, ఓఎన్జీసీ 4.68 శాతం, హిండాల్కో 4.03 శాతం, సన్ ఫార్మా 3.78 శాతం నష్టపోయాయి.
44 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
రిలయన్స్ స్టాక్ 1.82 శాతం లాభపడి రూ.1973 వద్ద క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ 2.52 శాతం, టీసీఎస్ 0.57 శాతం, విప్రో 2.15 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.18 శాతం నష్టపోయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.06 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.59 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.13 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.35 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.81 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.34 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.37 శాతం, నిఫ్టీ ఐటీ 1.69 శాతం, నిఫ్టీ మీడియా 2.25 శాతం, నిఫ్టీ మెటల్ 4.08 శాతం, నిఫ్టీ ఫార్మా 2.75 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.44 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.0 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.36 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications