ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్ సహా ఆసియా మార్కెట్లు నేడు భారీగా నష్టపోయాయి. ఇరు దేశాల మధ్య యుద్ధానికి తోడు, క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో ఆసియా, దేశీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ పతనమయ్యాయి. ఉదయం భారత మార్కెట్ ప్రారంభం కావడానికి ముందే పుతిన్ నోట రష్యా సైనిక చర్య ప్రకటన వెలువడింది. అందుకే మార్కెట్ ప్రారంభం నుండి నష్టాల్లోనే ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.

నాలుగో వరస్ట్ పతనం
అన్ని రంగాలు కూడా 3 శాతం నుండి 8 శాతం వరకునష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కోటి 5 శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్ ఏకంగా 55,000 పాయింట్ల దిగువన ముగిసింది. 55,418 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,996 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 54,383 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 2701 పాయింట్లు లేదా 4.72 శాతం క్షీణించి 54,529 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 4.78 శాతం క్షీణించి 16,248 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది నాలుగో వరస్ట్ పతనం. మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టపోయాయి. బీఎస్ఈ 30 స్టాక్స్‌లో 10 మాత్రమే లాభాల్లో ముగియగా, 20 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

రూ.13 లక్షల కోట్లు హుష్ కాకి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం నేపథ్యంలో దలాల్ స్ట్రీట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 2702 పాయింట్ల నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.13 లక్షల కోట్లు నష్టపోయింది. గత ఐదారు సెషన్‌లలో రూ.6 లక్షల కోట్లు క్షీణించింది. మొత్తం ఈ ఏడు సెషన్‌లలోనే దాదాపు రూ.20 లక్షల కోట్లు క్షీణించింది. డాలర్ మారకంతో రూపాయి 75.65 వద్ద ఉంది. మరోవైపు బంగారం ధర రూ.51,000 మార్కు దాటగా, చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లను చేరుకుంది.

టాటా మోటార్స్ 10 శాతం డౌన్
బీఎస్ఈ టాప్ 30లో అత్యధికంగా గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 20 శాతం మేర పడిపోయింది. నిఫ్టీలో టాటా మోటార్స్ షేర్ 10.71 శాతం క్షీణించి రూ.425.90 వద్ద ముగిసింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, గ్రాసీమ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ 7 శాతానికి పైగా క్షీణించాయి. 3478 ట్రేడెడ్ స్టాక్స్‌లో 232 మాత్రమే లాభపడగా, 3160 స్టాక్స్ నష్టపోగా, 86 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు. 72 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని, 279 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 95 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్, 1047 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications