భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, డాలర్‌తో బలపడుతున్న రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 289.72 పాయింట్లు లేదా 0.82% ఎగిసి 35,704.17 వద్ద, నిఫ్టీ 84.20 పాయింట్లు లేదా 0.81% లాభపడి 10,514.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 796 షేర్లు లాభాల్లో, 274 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రంగాలవారీగా చూస్తే ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ షేర్లు భారీ లాభాల్లో, ఇన్ఫ్రా, ఆటో షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హీరో మోటో కార్ప్, ఓఎన్జీసీ, ఐవోసీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, ఐచర్ మోటార్స్, వేదాంత, యూపీఎల్, నెస్ట్లే ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ సహా ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ కారణంగా మంచి లాభాలు కనబరిచాయి.

మరోవైపు, డాలర్ మారకంతో రూపాయి 9 పైసలు బలపడింది. నిన్న 75.59 వద్ద క్లోజ్ అయిన కరెన్సీ నేడు 75.50 వద్ద ప్రారంభమైంది.
అమెరికాలో కరోనా మహమ్మారి పెరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలు పడిపోయాయి. గత సెషన్లో బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ 6 సెంట్లు లేదా 0.1 శాతం పడిపోయిం 41.97 డాలర్లకు తగ్గింది. అంతకుముందు సెషన్లో 1.8 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications