సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్, కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(డిసెంబర్ 9) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 254.48 పాయింట్లు(0.56%) లాభపడి 45862.99 వద్ద, నిఫ్టీ 74.60 పాయింట్లు(0.56%) ఎగిసి 13467.60 వద్ద ప్రారంభమైంది. 1137 షేర్లు లాభాల్లో, 247 షేర్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. 40 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా క్షీణించి 73.59 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్లో 73.52 వద్ద ముగిసింది.
మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 318 పాయిం్ల లాభంతో 45,927 పాయింట్ల వద్ద ఉంది. ఓ సమయంలో 45,940 పాయింట్లను కూడా తాకింది. కీలక 46,000 స్థాయికి సమీపంలో ఉంది. వ్యాక్సీన్ అందుబాటులోకి రావడంతో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే సంకేతాల నేపథ్యంలో సూచీలు పైపైకి కదులుతున్నాయి. దీనికి తోడు బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి.

నేడు టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్ 2.88 శాతం, ఐటీసీ 2.22 శాతం, కోల్ ఇండియా 2.12 శాతం, టాటా మోటార్స్ 1.79 శాతం, ఐవోసీ 1.70 శాతం లాభాల్లో ఉన్నాయి.టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 0.96 శాతం, HDFC లైఫ్ 0.57 శాతం, మారుతీ సుజుకీ 0.59 శాతం, శ్రీసిమెంట్స్ 0.54 శాతం, ICICI బ్యాంకు 0.30 శాతం నష్టపోయాయి.మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర రూ.2020 వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications