సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్, పేటీఎం 7%తో అదరగొడుతోంది
స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 16) భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ నేడు 56,000 పాయింట్లను, నిఫ్టీ 16,850 పాయింట్లను దాటింది. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్‌లలో సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు ప్రకటన వచ్చే అవకాశముంది.
మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, చమురు ధరలు, చైనాలో కరోనా కొత్త వేరియంట్ లాక్ డౌన్ వంటి అంశాలు స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపవచ్చు. అయితే నిన్నటి భారీ నష్టాల కారణంగా కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతు లభిస్తోంది. అలాగే ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి.

భారీ లాభాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 56,555 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,761 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,389 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.51 సమయానికి సెన్సెక్స్ 888 పాయింట్లు ఎగిసి 56,665 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిప్టీ 16,877 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,942 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,837 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.51 సమయానికి నిఫ్టీ 264 పాయింట్లు ఎగిసి 16,918 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

అన్ని రంగాలు లాభాల్లోనే
అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ, పవర్, రియాల్టీ సూచీలు ఒక శాతం నుండి 2 శాతం మేర క్షీణించాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున ఎగిశాయి.నిన్నటి వరకు భారీగా పతనమైన పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాల్లో ఉన్నాయి. పేటీఎం స్టాక్ నేడు మధ్యాహ్నం సమయానికి దాదాపు 7 శాతం ఎగిసి రూ.632 వద్ద ట్రేడ్ అయింది.

బీఎస్ఈ మార్కెట్ క్యాప్ జంప్
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌కు రూ.2.51 లక్షల కోట్లుగా ఉంది. నేడు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ టెన్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications