భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు ఎకనమిక్ సర్వేలో సానుకూలంగా ఉంటాయనే వార్తల నేపథ్యంలో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఈ సర్వే ఫలితాలు అందుకు అనుగుణంగా ఉండటంతో దూసుకెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా నమోదు అవుతుందని ఆర్థిక సర్వే అంచనాలు ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో ఉదయం నుండి కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉన్నాయి.
ఉదయం 57,845.91 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 58,257.63 గరిష్టాన్ని, 57,746.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,301.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,410.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,264.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 813.94 (1.42%) పాయింట్లు లాభపడి 58,014.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 237.90 (1.39%) పాయింట్లు ఎగిసి 17,339.85 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, ఆసియా మార్కెట్లు బలమైన సంకేతాలకు తోడు రేపు కేంద్ర బడ్జెట్ పైన సానుకూలంగా ఉన్న ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. నేడు ఓ దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ఆటో, ఫార్మా, ఐటీ, చమురు, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, రియాల్టీ సూచీలు 1 శాతం నుండి 3 శాతం మేర లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications