ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న ఏకంగా 1,115 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ వరుసగా ఆరు రోజుల పాటు నష్టపోయి 2750 పాయింట్ల మేర నష్టపోయింది. వారాంతంలో అదే స్థాయిలో పుంజుకుంది. ఈ రోజు సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 835.06 పాయింట్లు(2.28%) లాభపడి 37,388.66 పాయింట్ల వద్ద, నిఫ్టీ 244.80 పాయింట్లు (2.27%) లాభపడి 11,050.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
1953 షేర్లు లాభాల్లో, 648 షేర్లు నష్టాల్లో, 165 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం నుండి 3 శాతం మేర లాభపడ్డాయి.

లాభాల్లో దిగ్గజ కంపెనీలు..
- దిగ్గజ కంపెనీలు భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు రెండు శాతం మేర లాభపడ్డాయి. దీంతో నిఫ్టీ తిరిగి 11,000 దాటగా, సెన్సెక్స్ 37,000 మార్క్ దాటింది.
- నిన్నటి నష్టంతో పోలిస్తే స్టాక్ మార్కెట్లు ఈ రోజు 70 శాతం తిరిగి రాబట్టగలిగింది.
- 47 నిఫ్టీ స్టాక్స్ భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 245 పాయింట్లు, సెన్సెక్స్ 835 పాయింట్లు లాభపడింది.
- బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు రూ.3.4 లక్షల కోట్లు తిరిగి వచ్చింది.
- నిఫ్టీ బ్యాంకు 464 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ సూచీలు కూడా అంతే స్థాయిలో పుంజుకున్నాయి.
- అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఆటో, ఐటీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
- వొడాఫోన్ ఐడియా షేర్ 12 శాతం మేర లాభపడింది.
- కాకినాడ సెజ్ సేల్ జీఎంఆర్ ఇన్ఫ్రా లాభాలకు కారణమైంది. ఇది ఏకంగా 11 శాతం మేర లాభపడింది.
- హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. హార్లే డేవిడ్సన్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు రావడంతో ఈ షేర్లు ఎగిశాయి.

రిలయన్స్, ఐటీ, ఆటో జూమ్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 0.81 శాతం మేర లాభపడింది. నిన్న రూ.14 లక్షల కోట్ల దిగువకు పడిపోయిన మార్కెట్ క్యాప్ ఈ రోజు పెరిగింది.
- టీసీఎస్ షేర్ ధర 3.67 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 3.20 శాతం, విప్రో షేర్ ధర 3.02 శాతం, టెక్ మహీంద్ర షేర్ ధర 3.01 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర 5.30 శాతం మేర లాభపడింది. ఐటీ స్టాక్స్ అన్నీ 3 శాతానికి పైగా లాభపడ్డాయి.
- ఆటో స్టాక్స్ కూడా లాభాల్లో ముగిశాయి. హీరో మోటో కార్ప్ 2.80 శాతం, బజాజ్ ఆటో దాదాపు 1 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధర 2.96 శాతం లాభపడింది. ఇతర ఐటీ స్టాక్స్ మైండ్ ట్రీ 1.50 శాతం లాభపడగా, కోఫోర్జ్ ఏకంగా 9.01 శాతం లాభపడింది. బిర్లా సాఫ్ట్ 4 శాతం, సొనాటా సాఫ్టువేర్ 3.51 శాతం, ఎల్ అండ్ టీ 1.89 శాతం లాభపడ్డాయి.
- మార్కెట్‌లో అతిపెద్ద వాటా కలిగిన రిలయన్స్ లాభాలకు తోడు, కీలకమైన ఐటీ, ఆటో రంగాలు మంచి లాభాలు చూడటంతో మార్కెట్లు పుంజుకున్నాయి.

బలపడిన రూపాయి
- టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా, భారతీ ఎయిర్ టెల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.
- ఎన్ఎస్ఈ ప్లాట్‌ఫాంలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ 3.22 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి.
- డాలర్ మారకంతో రూపాయి 73.61 వద్ద ముగిసింది. ఉదయం 15 పైసలు లాభపడి 73.75 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.90 వద్ద ముగిసింది. ఈరోజు 73.57-73.77 మధ్య ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications