సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్, అదానీ విల్మర్ అదరగొట్టింది
స్టాక్ మార్కెట్లు మంగళవారం(ఏప్రిల్, 26) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు, ఈ రోజు మాత్రం అదరగొడుతున్నాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 700 పాయింట్ల మేర లాభపడింది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లడం అక్కడి సూచీలపై ప్రభావం చూపాయి. ఆసియా - పసిఫిక్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. చైనాలో కఠిన ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలు రెండు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఎల్ఐసీ ఐపీవో మే 4వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది.
ఇన్ని పరిణామాలు సూచీలకు కలిసి వచ్చాయి. దీంతో సెన్సెక్స్ 57,066.24 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,333.49 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,066.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.20 సమయానికి 609 పాయింట్లు ఎగిసి 57,189 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 200 పాయింట్లు లాభపడి 17,154 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, హిండాల్కో, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. అదానీ విల్మర్ మార్కెట్ క్యాప్ 1 లక్ష కోట్లను క్రాస్ చేసింది. నేడు ఈ స్టాక్ దాదాపు 5 శాతం లాభపడి రూ.803 వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications