ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 24) భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల అండతో వరుసగా మూడో రోజు అదరగొట్టాయి. అయితే ఐటీ, ఎప్ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్లాక్ మండే సందర్భంగా 1400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, ఈ మూడు రోజుల్లో కవర్ అయింది. నేడు సెన్సెక్స్ ఓ దశలో 47,000 మార్కును దాటింది. చివరకు మరో 27 పాయింట్ల దూరంలో నిలిచి, క్లోజ్ అయింది. నిఫ్టీ 13700 పాయింట్లను దాటింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ భారీ జంప్
సెన్సెక్స్ 529 పాయింట్లు(1.14 శాతం) లాభపడి 46,973.54 పాయింట్ల వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు(1.09 శాతం) ఎగిసి 13,749.25 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి భారీ నష్టాలు ఈ మూడు రోజుల్లో కవర్ అయ్యాయి. మార్కెట్లకు ఫైనాన్షియల్ స్టాక్స్ అండగా నిలవగా, ఐటీ స్టాక్స్ కిందకు లాగాయి. నిఫ్టీ బ్యాంకు ఒకటిన్నర శాతానికి పైగా లాభపడింది. నిఫ్టీ బ్యాంకు 519 లాభపడి 30,402 పాయింట్లకు, మిడ్ క్యాప్ సూచీ 36 పాయింట్లు ఎగిసి 20,476 పాయింట్లకు ఎగిసింది. వేదాంత స్టాక్స్ 7 శాతం లాభపడ్డాయి. బెక్టార్స్ ఫుడ్ ఆరంభంలోనే 106 శాతం లాభపడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 3.99 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.00 శాతం, సన్ ఫార్మా 2.76 శాతం, ONGC 2.59 శాతం, రిలయన్స్ 2.59 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇన్ఫోసిస్ 1.36 శాతం, నెస్ట్లే ఇండియా 0.89 శాతం, విప్రో 0.87 శాతం, యూపీఎల్ 0.56 శాతం, గ్రాసీమ్ 0.54 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎప్‌సీ ఉన్నాయి.

రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 1.09 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.28 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.47 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.74 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.40 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.81 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.44 శాతం, నిఫ్టీ మెటల్ 0.33 శాతం, నిఫ్టీ ఫార్మా 1.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.61 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.59 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఐటీ 0.66 శాతం, నిఫ్టీ మీడియా 0.76 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.43 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications