భారీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్
స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 20) లాభాల్లోకి వచ్చాయి. వరుసగా ఐదు సెషన్లు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు ఆరంభం నుండి లాభాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు పరుగు పెడుతున్నాయి. ఇటీవల వరుసగా రెండు రోజుల్లోనే సూచీలు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో రూ.8 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. నేడు అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలకు తోడు, భారీ నష్టాల నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
మంగళవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి. ఐఎంఎఫ్ ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు అంచనాలను 9 శాతం నుండి 8.2 శాతానికి కుదించింది. రష్యా-ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని రష్యా తీవ్రం చేయడం, ద్రవ్యోల్భణ భయాలు, బాండ్స్ రాబడుల పెరుగుదల ఇన్వెస్టర్లను అప్రమత్తతగు గురి చేస్తున్నాయి.

సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 56,463 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 56,741 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఓ సమయంలో 57,000 పాయింట్లను క్రాస్ చేసింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 56,858 పాయింట్ల వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు ఎగిసి 17,083 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. పీఎస్‌యూ ఇండెక్స్ గత 9 సెషన్‌లలో దాదాపు 10 శాతం లాభపడింది. ఆటో, ఐటీ రంగాలు లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications