ప్రయివేటు బ్యాంక్స్, రిలయన్స్ ఎఫెక్ట్.. మార్కెట్లు జూమ్: బలపడిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు (ఆగస్ట్ 18) లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 477.54 పాయింట్లు లేదా 1.26% లాభపడి 38,528.32 వద్ద, నిఫ్టీ 138.30 పాయింట్లు లేదా 1.23% ఎగిసి 11,385.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1,860 షేర్లు లాభాల్లో, 886 షేర్లు నష్టాల్లో ముగియగా, 132 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి 74.75 వద్ద క్లోజ్ అయింది. నిన్న 74.89 వద్ద ముగిసింది. ఈ రోజు 14 పైసలు బలపడింది.

ప్రయివేటు బ్యాంకులు, రిలయన్స్‌తో జూమ్
ఫార్మారంగంలో స్వల్ప నష్టాలు మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఒక శాతం చొప్పున ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్, అల్ట్రా టెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా, గెయిల్, ఐవోసీ ఉన్నాయి. ప్రయివేటు బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాల్లో ముగియడంతో మార్కెట్ ఎగిసిపడింది.

అశోక్ లేలాండ్ డబుల్
ప్రయివేటురంగ బ్యాంకులు 5 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. దీనికి తోడు రిలయన్స్ కూడా భారీగా పుంజుకోవడంతో నిఫ్టీ ఎగిసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. ఫార్మా స్వల్పంగా 0.1 శాతం నష్టపోయింది. మిగతా అన్నీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ కూడా లాభాల్లోనే ముగిసింది. అశోక్ లేలాండ్ స్టాక్స్ దాదాపు 10 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.38 శాతం, లాభపడింది. అశోక్ లేలాండ్ మార్చి కనిష్టం రూ.33.70తో పోలిస్తే ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ (రూ.68.95) పెరిగింది. ఇతర రంగాల్లో మీడియా, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 2.2-0.6 శాతం మధ్య లాభపడ్డాయి.

FPI, DII...
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు(FPI)లు రూ.333 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్(DII)లు రూ.718 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన FPIలు స్వల్పంగా రూ.46 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. DIIలు రూ.797 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications