ముంబై: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 306.19 పాయింట్లు(0.77%) లాభపడి 40,063.77 వద్ద, నిఫ్టీ 91.50 పాయింట్లు(0.78%) లాభపడి 11,760.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 677 షేర్లు లాభాల్లో, 192 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 39 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 0.7 శాతం మేర లాభపడ్డాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు లాభపడి ప్రారంభమైంది. నిన్న 74.43 వద్ద క్లోజ్ అయింది.

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్
మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. గం.11.30 సమయానికి 530 పాయింట్ల ఎగిసి 40,288 పాయింట్లను తాకింది. పదకొండున్నర సమయానికి 423 పాయింట్లు ఎగిసి 40,180 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

పుంజుకున్న రిలయన్స్
నిఫ్టీ ఆటో 1.62 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.98 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.36 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.92 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.66 శాతం, నిఫ్టీ ఐటీ 0.82 శాతం, నిఫ్టీ మీడియా 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 1.65 శాతం, నిఫ్టీ ఫార్మా 0.85 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.64 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.08 శాతం లాభపడ్డాయి. కేవలం నిఫ్టీ రియాల్టీ 0.34 శాతం నష్టపోయింది. నిన్న నిఫ్టీ రియాల్టీ భారీగా లాభపడింది.
ఐచర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లాభపడ్డాయి.
నిన్న దాదాపు 9 శాతం నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర ఈ రోజు 1.40 శాతం పెరిగి రూ.1,903.70 పలికింది.
సెన్సెక్స్ 30లో కేవలం మూడు షేర్లు మాత్రమే నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్ జంప్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.74 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.44 శాతం, టెక్ మహీంద్ర 0.24 శాతం, విప్రో 1.16 శాతం, మైండ్ ట్రీ 1.59 శాతం, కోఫోర్జ్ 1.61 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ స్టాక్ మాత్రం 0.36 శాతం నష్టపోయింది.
కాడిలా హెల్త్ కేర్ దాదాపు 8 శాతం లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాడిలా సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు భారీగా ఎగిశాయి. దీంతో స్టాక్స్ లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ స్టాక్ 1 శాతం ఎగిసింది. నిఫ్టీ మెటల్‌లో జిందాల్ స్టీల్, హిండాల్కో స్టాక్స్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications