ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. గురువారం (డిసెంబర్ 23) మార్కెట్లు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 437 పాయింట్లు(0.95 శాతం) లాభపడి 46,444.18 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు(1 శాతం) లాభపడి 13,601.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ 4 శాతం మేర లాభపడింది. మెటల్, టెలికం, ఐటీ, టెక్ సూచీలు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 5.86 శాతం, సిప్లా 3.73 శాతం, టాటా స్టీల్ 3.33 శాతం, ఇన్ఫోసిస్ 2.67 శాతం, టాటా మోటార్స్ 2.58 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 0.87 శాతం, టైటాన్ కంపెనీ 0.53 శాతం, NTPC 0.35 శాతం, కోల్ ఇండియా 0.33 శాతం, హీరో మోటో కార్ప్ 0.30 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఇన్పోసిస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

ఐటీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల ఎఫెక్ట్
ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ సూచీలు ఎగిసిపడ్డాయి. నిఫ్టీ, నిఫ్టీ బ్యాంకు కూడా లాభాల్లో ఉన్నాయి. 40 నిఫ్టీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. డిష్ టీవీ స్టాక్స్ 11 శాతం మేర లాభపడ్డాయి. ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఐటీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రాణించడంతో మధ్యాహ్నం దూసుకెళ్లాయి. దీంతో నిఫ్టీ 13,600 మార్కు దాటింది. ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 24,162ను అధిగమించగా, బీఎస్ఈలో 24,174కు చేరింది.
ఇంట్రాడేలో టీసీఎస్ రూ. 2,919 వద్ద, ఇన్ఫోసిస్ రూ.1255 సమీపంలో, టెక్ మహీంద్రా రూ.960 సమీపంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.933 సమీపంలో సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరకు టీసీఎస్ 2907.15 వద్ద ముగిసింది. రిలయన్స్ స్టాక్ 0.53 శాతం లాభపడి రూ.1947 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 సూచీ 1 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.84 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.33 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.87 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.36 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.66 శాతం, నిఫ్టీ ఎప్ఎంసీజీ 1.91 శాతం, నిఫ్టీ ఐటీ 2.36 శాతం, నిఫ్టీ మీడియా 3.27 శాతం, నిఫ్టీ మెటల్ 1.77 శాతం, నిఫ్టీ ఫార్మా 1.61 శాతం, నిఫ్టీ పీఎస్‌యు బ్యాంకు 2.06 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.94 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.96 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications