ఆరు రోజులు భారీ నష్టం... బడ్జెట్ రోజు మార్కెట్లు భారీగా జంప్, సెన్సెక్స్ 1600 పాయింట్లు జంప్
ముంబై: బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 4000 పాయింట్ల వరకు కుప్పకూలిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం 50,000 మార్కును తాకిన సెన్సెక్స్ నాటి నుండే నష్టాల్లో ఉంది. ఆల్ టైమ్ గరిష్టం నుండి క్రితం సెషన్ సమయానికి దాదాపు 4000 పాయింట్లు నష్టపోయింది. అయితే బడ్జెట్ రోజు నేడు (సోమవారం, 1 ఫిబ్రవరి) లాభాల్లో ప్రారంభమయ్యాయి.
గతవారం సెన్సెక్స్ 46,285.77 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 350 పాయింట్ల వరకు లాభపడి 46,617 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో దాదాపు 500 పాయింట్లు లాభపడి 46,777.56 పాయింట్లను తాకింది. ఉదయం గం.9.45 సమయానికి 46,522 పాయింట్ల వద్ద ఉంది.

టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, ఐవోసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, టాటా మోటార్స్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, రిలయన్స్, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు ఉన్నాయి.
ఆ తర్వాత నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోను మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లు లాభపడి 47,919 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications