మార్కెట్లు భారీగా జంప్, సెన్సెక్స్ 52,000 దిశగా: టాప్ లూజర్స్, గెయినర్స్
ముంబై: స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 52 వేల దిశగా సాగుతోంది. వరుసగా ఏడో సెషన్‌లో మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల అండతో సూచీలు నేడు (ఫిబ్రవరి 9, మంగళవారం) లాభాలతో ప్రారంభమయ్యాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 15,200 మార్కుకు చేరువగా ఉంది. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. బడ్జెట్ అనంతరం సూచీలు ప్రతి రోజు కొత్త శిఖరాలను తాకుతున్నాయి.

సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్
సెన్సెక్స్, నిఫ్టీలు బడ్జెట్ అనంతరం పది శాతం చొప్పున ర్యాలీ చేశాయి. ఉదయం 51,484.23 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 51,753.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,377.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,164.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,237.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,133.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.12.45 సమయానికి 362 పాయింట్లు లాభపడి 51,711 పాయింట్ల వద్ద ఉంది. డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు లాభపడి 72.88 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 72.96 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 4.66 శాతం, SBI లైఫ్ ఇన్సురా 3.70 శాతం, ONGC 3.21 శాతం, HDFC లైఫ్ 3.01 శాతం, టైటాన్ కంపెనీ 2.13 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో IOC 4.90 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.82 శాతం, టాటా మోటార్స్ 2.13 శాతం, JSW స్టీల్ 1.65 శాతం, బజాజ్ ఆటో 1.47 శాతం నష్టాల్లో ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్ ఉన్నాయి.
హెవి వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇప్పటికీ రూ.2000కు దిగువనే ఉంది.
ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్ ధర దాదాపు 10 శాతం లాభపడింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.74 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.14 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 0.86 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.91 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.71 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.26 శాతం, నిఫ్టీ ఐటీ 0.74 శాతం, నిఫ్టీ మెటల్ 0.17 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.57 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.63 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.84 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.99 శాతం, నిఫ్టీ మీడియా 1.47 శాతం, నిఫ్టీ ఫార్మా 0.21 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications