ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(జనవరి 5) సరికొత్త గరిష్టాలను తాకాయి. వరుసగా పదోరోజు సూచీలు లాభాల్లో ఉన్నాయి. సోమవారం సెన్సెక్స్ 48వేల (48,176) మార్కును దాటిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు ఉదయం లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ప్రారంభంలో నష్టపోయాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణించి 47,940 పాయింట్ల దిగువకు చేరుకుంది. అయితే ఇది రెండు గంటలు మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కనిపించినప్పటికీ, ఆ తర్వాత జంప్ చేశాయి. సెన్సెక్స్ 48,500 దిశగా కనిపించింది.

నష్టాల నుండి లాభాల్లోకి
సెన్సెక్స్ 260.98 పాయింట్లు (0.54%) లాభపడి 48,437.78 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66.60 పాయింట్లు (0.47%) లాభపడి 14,199.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1740 షేర్లు లాభాల్లో, 1268 షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ సూచీలూ 1.5 శాతం నుండి 2.5 శాతం మేర లాభపడ్డాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, చివరకు మంచి లాభాలతో ముగిశాయి.
ఇక, డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు క్షీణించి 73.17 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 14 పైసలు క్షీణించి 73.16 వద్ద ప్రారంభమైంది. నేటి ట్రేడింగ్‌లో 73.08-73.27 మధ్య కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 6.36 శాతం, HDFC 2.84 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.65 శాతం, HDFC లైఫ్ 2.57 శాతం, విప్రో 2.50 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 2.06 శాతం, JSW స్టీల్ 1.95 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.86 శాతం, టాటా స్టీల్ 1.80 శాతం, హిండాల్కో 1.57 శాతం లాభపడ్డాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.
రిలయన్స్ షేర్ నేడు మరింత పతనమైంది. 1.30 శాతం దిగజారి రూ.1965 వద్ద ముగిసింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.47 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.91 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 1.63 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.23 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.29 శాతం, నిఫ్టీ ఐటీ 2.62 శాతం, నిఫ్టీ మీడియా 0.67 శాతం, నిఫ్టీ ఫార్మా 0.13 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.10 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.93 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.02 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.61 శాతం, నిఫ్టీ మెటల్ 1.41 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.35 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications